ఒకప్పటి కవితలు.
---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.
"నెమ్మనము తాపమడగించు కమ్మతావు
లలముకొనుటలో తన రాక తెలియుచుండ
నుత్తరపు గాలి చలిబాధ కోర్చి మించి
మలయపవనమ్ము నామీద మలయు టెపుడొ."
"గోడచాటయ్యు చెలినీవు పాడు పాట
వలపు మొలకకు అమృతంపు చెలమ యయ్యె
తలిరుటాకుల చాటుగ దాగకేమి
పికకుహూశ్రుతి వీనుల విందు గాదొ"
హృదయ పుస్తకమందదికింపబడిన
ప్రేమగీతాలపుట చింపివేయుటెట్లు?
చినుగు వెంబడి పైకెగజిమ్ము రక్త
మున కలసి ప్రాణముల్లేచి పోవకుండ"
* * *
"నీవు మడిగట్టుకొని పోయినావు, పండ్లు,
పుష్పములు తీసికొని దేవపూజకెటకొ
నేను నీ కొంగు పట్టుక నీదు వెంట
పోవుటకు లేక కన్నీటిబొట్లు రాల్తు."
"ఏను స్నానమ్మునకు బావి కేగునపుడు
లేత సూర్యుని బంగారు పూతలందు
మురియుచును తల్లి యొడ్డును ముద్దుగొనుచు
అమ్మ యేదిరా యన్న వాయలలు నన్ను."
* * *
"తురగమ్ము నెక్కి దక్షిణ
కర కమల స్ఫురిత ఖడ్గ కాంతుల దిశలన్
మిరు మిట్లు గొలుప, నీ వు
త్తర కార్యము దీర్ప వచ్చెదవె కల్క్యాత్మా"
* * *
"నీవు చలద్ఘనాఘన వినీల మహాపఘనుండవై భవ
ఛ్ఛ్రీ విపులోరు వక్షమున చిందులు త్రొక్కెడి నేను చంచలన్
కావుటదేమి అబ్బురము? క్రమ్ము మయాయిక మత్తటిత్తనూ
వ్యావృత ధూమలుండవయి అన్నగమార్గములమ్మయమ్ముగన్"
(సమాధానాలు మరోసారి)
No comments:
Post a Comment