ఒకప్పటి కవితలు
"కనుల నొండొరులను..............
...............కావలయు సఖుడ!"
"పరమధర్మార్థమైన.....................
.....................ప్రేమ యందె ముక్తి"
ఇవి "తృణకంకణం" లఘు కావ్యం లోనివి.
"పూర్వ లక్షణములు.......................
.................'అనుక్తంబు ' గ్రథనమందు"
"కుల శుభాంగీ............................
......................రుచులను వలచె నేడు"
ఇవి "రమ్యాలోకం" లోనివి.
"పదినెలలాయె బందెబడి..........................
.......................మధూదయ పర్యుషస్సులన్."
ఇది ద్విపద ఖండికలోనిది.
"ఏదేశమేగినా ఎందుకాలిడినా
ఏపీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీతల్లి భూమిభారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము!"
కవి రాయప్రోలు సుబ్బారావు. ఈయన తెలుగు భావకవిత్వ యుగానికి ఆద్యుడు.
1892 లో గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించారు. 1909 లో "గోల్డ్ స్మిత్" 'హెర్మిట్' చదివి, దాన్ని అనుసరిస్తూ "లలిత" అనే లఘుకావ్యం వ్రాశారు. 1910 లో టెన్నిసన్ వ్రాసిన "డోరా" ఆధారంగా "అనుమతి" అనే మరో లఘుకావ్యం వ్రాశారు. 1912 లో ప్రచురితమైన "తృణకంకణం" తో యుగకర్త గా గుర్తింపబడ్డారు.
"అమలిన శృంగారం"; "అప్రాప్త మనోహరి" అనగానే గుర్తొచ్చేది వీరే! ఇంకా కష్ట కమల; స్నేహలతాదేవి; స్వప్నకుమారం; ఆంధ్రావళి; జెడకుచ్చులు; రమ్యాలోకం; మధుశాల (ఒమర్ ఖయ్యం రుబాయీలకు అనువాదం) వంటివి వ్రాశారు.
1913 నాటి ఆంధ్రోద్యమ ప్రభావంతో వ్రాయబడిన ద్విపద ఖండిక లోనిదే "యేదేశమేగినా........".
No comments:
Post a Comment