Friday, June 13, 2008

కృతజ్ఞత




.........."వర్షం వెళ్ళిపోయింది.....మబ్బుల రథాలెక్కి!

జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు!

భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయటపెట్టి

మొదటవచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది....కృతజ్ఞతతో.........."

----------శేషేంద్ర (గుంటూరు శేషేంద్ర శర్మ)


..........నేనుతప్ప!



నిరంతరం నాకోసం ఎవ్వరూ ఏడవరు..........

..........నాకళ్ళుతప్ప!

నిరంతరం నాకోసం నాతో ఎవ్వరూ నడవరు..........

..........నా అడుగులు తప్ప!

నిరంతరం నాకోసం నాతో ఎవ్వరూ మాట్లాడరు..........

..........నిశ్శబ్దం తప్ప!

నిరంతరం నాకోసం నాకు తోడుగా ఎవ్వరూ నిలవరు..........

..........నా ఒంటరితనం తప్ప!

నిరంతరం నన్ను నన్నుగా ఎవ్వరూ గుర్తించరు..........

..........నా అంతరాత్మ తప్ప!

నిరంతరం నాకోసం నన్ను నన్నుగా ఎవ్వరూ ప్రేమించరు..........
..........నా మనస్సు తప్ప!

..........అందుకే ఇంట్రావర్ట్ నయిన నా లోకంలో

నాకంటూ ఎవ్వరూ ఉండరు--నేను తప్ప!

----------శ్రీ

3 comments:

Bolloju Baba said...

ప్రతిఒక్కరికీ ఇలాంటి అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఒక ఫేజ్ గా ఉంటుంది. దాన్ని చాలా బాగా పట్టుకనన్నారు.
బొల్లోజు బాబా

A K Sastry said...

చాలా సంతోషం! బాబా గారూ!

మీ కామెంట్ కి సమాధానం ఇద్దామని ప్రతీ రోజు ప్రయత్నిస్తున్నాను! కాని మాకు ఇక్కడ పవర్ కట్ చాలా తీవ్రంగా ఉంది! అదీ బాధ!

ప్లీజ్! చదువుతూ ఉండండి.

కాముధ said...

ఇది మాత్రం నిజం గా నిజం - కాముధ