Sunday, July 20, 2008

నిశ్శబ్ద రాగాలు


తిమిర స్రవంతిలో నక్షత్రాల నీటిబిందువులు మెరుస్తుంటే
కొండల మండువాలో ఎక్కడో ఆకాశం భూమిని ముద్దాడుతుంటే

అది చూసి చెట్ల ఆకులు సిగ్గుతో ముడుచుకుపోతుంటే
అంతటానిశ్శబ్దం ఆవరించి ఉంటే..........

స్వప్న లోకాల్లొ విహరిస్తున్న నాకు
జాబిల్లి చల్లని వెన్నెల జలాలు చల్లి నిశ్శబ్దం గా మేలుకొలుపు పాడింది.

అప్పుడే తెలిసింది నాకు....నిశ్శబ్దంలో రాగాలు పలుకుతాయని!
నిశ్శబ్దం ఎంత మధురమైనది!

ఒంటరితనపు ఊయలలో ఓలలాడుతూ
తీయని నిశ్శబ్దపు మాధుర్యాన్ని అనుభవించేవేళలో
చప్పుడుచేస్తే నాగుండెనైనా క్షమించలేను!

-----శ్రీ

2 comments:

Bolloju Baba said...

నిశ్శబ్ధాన్ని చిద్రం చేసే గుండె చప్పుడుని కూడా క్షమించలేను! అన్న వ్యాక్యంతో ఈ కవిత లోతుల్ని బహు చక్కగా అవిష్కరించారు.

బొల్లోజు బాబా

A K Sastry said...

బాబాగారూ! థేంక్స్!

మీ ప్రోత్సాహంతో, మరిన్ని ప్రచురిస్తాను! చూస్తూనే వుండండి.