....నా అంతరంగంయెందరో బాటసారుల ఆశాంచల వీధులలో
ఉషస్సునై మల్లికలా వికసించాను….
ఇంకెందరో బాటసారుల కనులలో
రంగురంగుల కలల పులుగులకి
ఆశల పట్టుదారం తో ఊహల గూళ్ళు నిర్మించాను!
నా అంతరంగం తెలియని వారందరూ
నేను పొగరున్న శిలనన్నారు!
జగమొండి మరబొమ్మనన్నారు!
నిజం కాని కలనన్నారు!
కలవరపరిచే కలకంఠినన్నారు!
నేను……
శిలను కాను; కలను కానేకాను!
మరబొమ్మనీ కాను; మానూ మాకునీకాను!
అనుభూతి లతాగ్రాలలో పూసిన ప్రేమ పుష్పాన్ని…
అర్థం చేసుకున్నవారికి అపురూపమైన ఆనందాన్ని!
అర్థం చేసుకోలేనివారికి అందని వరాన్ని!
----శ్రీ
2 comments:
తనను తాను తెలుసుకుని ఆవిష్కరించుకున్నవాడు ధన్యజీవి. తన అంతరంగాన వున్న తనమతిని అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు.
డియర్ ఉష!
అయితే 'శ్రీ' అదృష్టవంతురాలన్నమాట!
ధన్యవాదాలు!
Post a Comment